SKLM: పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు త్రాగునీరు అందించేందుకు ఆదివారం పైప్ లైన్ పనులను ప్రారంభించారు. సుమారు 265 కోట్ల రూపాయల నిధులతో ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు కూటమినాయకులు తెలిపారు. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని త్రాగునీటి సమస్యలు ఉండవని వారు తెలిపారు. త్వరగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.