BDK: పినపాక మండలం మద్దులగూడెం గ్రామంలో పోడు భూములను సాగు చేసుకుంటున్నా గిరిజనుల పంట పొలాలను సీపీఎం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య ఆదివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. చాలాకాలంగా పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని తెలిపారు. ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని కనకయ్య డిమాండ్ చేశారు.