NLG: చిట్యాల మండలం తాళ్లావెళ్లంలలో కల్లు గీత కార్మిక సంఘం 68 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, గీచే వారిదే చెట్టు అనే నినాదంతో కల్లు గీత కార్మిక సంఘం ఏర్పడిందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పామనుగుళ్ళ అచ్చాలు అన్నారు. సంఘం జెండాను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… ధర్మబిక్షం, ఎస్ఆర్ దాట్ల నాయకత్వంలో 1957 లో సంఘం ఏర్పడిందన్నారు.