రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ భారతదేశానికే పర్యాయపదంగా నిలిచారని కొనియాడారు. 35 ఏళ్లుగా నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర గురించి ప్రస్తావించారు. ‘భారత్లో అన్ని మతాల సహజీవనం స్ఫూర్తినిస్తుంది. గాంధీ కుటుంబం కూడా దేశానికి అదే విధంగా స్ఫూర్తినిచ్చింది’ అని ఆయన అన్నారు.