ASR: పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని, కాలుష్య రహితంగా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదివారం జిల్లా ప్రజలకు సూచించారు. పండుగలో శబ్ధ, వాయు కాలుష్యం తక్కువగా ఉండే గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి పండుగ అన్నారు.