SDPT: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఏఐసీసీ మైనారిటీ అబ్జర్వర్‌గా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ఛైర్మన్ మజర్ మాలిక్ నియమితులయ్యారు. ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ ఛైర్మన్, రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా కృషి చేయాలని మజర్ మాలిక్‌కు సూచించినట్లు తెలిపారు.