TG: రాష్ట్ర రాజకీయ నేతలకు కేంద్రమంత్రి బండి సంజయ్ గట్టి హెచ్చరిక చేశారు. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలని, లేకపోతే వారి బండారం బయటపెడతామని హెచ్చరించారు. అవినీతి, మాఫియా, తీవ్రవాదంపై కేంద్రం నిఘా ఉందని.. కనికరం లేకుండా కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. దేశ అంతర్గత భద్రత విషయంలో తప్పు వైపు నిలబడితే, ఎంత పెద్ద నేతలైనా కూలిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.