WGL: గీసుకొండ మండలం గొర్రెకుంట బీఆర్ఎస్ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు లాదెళ్ల రాజు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం మోగిలిచర్ల స్మశాన వాటికలో స్థానికులు రాజు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.