BDK: మణుగూరు మండలం ఆదర్శ్నగర్కు చెందిన తిరుపతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తిరుపతయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు పాల్గొన్నారు.