KKD: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దీపావళి సామగ్రి అమ్మకందారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా దీపావళి సామాగ్రి అమ్మకాలు జరిగే తునిలోని రాజా గ్రౌండ్ ప్రస్తుతం నీటితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో దీపావళి సామగ్రి దుకాణాల ఏర్పాటు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మేరకు అధికారులు స్పందించి గ్రౌండ్లో నీటిని బయటకు తోడే ఏర్పాట్లు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు.