MDK: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అగ్నిమాపక సిబ్బందికి సూచించారు. రామాయంపేట అగ్నిమాపక కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అగ్నిమాప కేంద్రంలో పరికరాల పనితీరు, వాహనాల వినియోగం, సిబ్బంది హాజరు పట్టికలు పరిశీలించారు. సిబ్బంది శిక్షణ, పరికరాలు, భవన భద్రత నియమాలపై అధికారులకు సూచనలు చేశారు.