NLG: కనగల్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ కంబాల శివలీలా రెడ్డికి విశ్వమాత మదర్ థెరిసా జాతీయ పురస్కారం ప్రకటించారు. హెల్ప్ ఫౌండేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా తన సేవలను గుర్తించి ఈ పురస్కారం లభించినట్లు శివలీలా రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 26న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పురస్కారం అందుకోనున్నట్లు తెలిపారు.