‘దంగల్’లో అమీర్ ఖాన్ చిన్నకూతురిగా నటించిన నటి జైరా వసీమ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయన్ని తెలుపుతూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. అయితే, తన భర్తకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.