ఆస్ట్రేలియా-భారత్ తొలి వన్డేలో వర్షం దోబూచులాడుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ను 35 ఓవర్లకు కుదించారు. ఆట తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ అయ్యర్ (11) వికెట్ను కోల్పోయింది. ఈ సమయంలో మరోసారి వర్షం రావడంతో ఆట నిలిపివేశారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 14.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 46 పరుగులుగా ఉంది. క్రీజులో రాహుల్, అక్షర్ పటేల్ ఉన్నారు.