BDK: టేకులపల్లి మండలం పెగల్లపాడు పంచాయతీలో ఆదివారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించారు. ముందుగా ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతిచెందిన వట్టం స్వామి భౌతికాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కొట్టెం భద్రమ్మను పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.