SRCL: పేదలకు ఉచితంగా వైద్య సేవలు లయన్స్ క్లబ్ ద్వారా అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి హాజరై ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు.