KDP: రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డికి సాహిత్య కళానిధి జాతీయ లెజెండరీ పురస్కారం ప్రకటించారు. సాహిత్య, కళా, ఆధ్యాత్మిక రంగాల్లో చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, హైదరాబాద్ వారు తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. కాగా, అవార్డు ఈ నెల 19న రవీంద్ర భారతిలో అందజేస్తారు.