సత్యసాయి: పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు నవంబర్ 19 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఉత్సవాలు లేడీస్ డే కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. 20 నుంచి 22 వరకు ప్రపంచ సదస్సు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. నవంబర్ 23న బాబా 100వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాన ఉత్సవం జరుగుతుందని తెలిపారు.