MDCL: ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. వందలాది మంది సొంతూరుకు వెళ్లడం కోసం బస్టాండ్ వద్దకు వచ్చారు. సరైన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. వెంటనే తగిన సంఖ్యలో బస్సులు అరేంజ్ చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.