NRML: మద్యం దుకాణాల దరఖాస్తు గడువు తేదీ ఈ నెల 23 వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ అబ్దుల్ రజాక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ బీసీ బందు, దీపావళి పండుగ, బ్యాంకు సెలవులను పరిగణలోకి తీసుకొని గడువు తేదీ పొడిగించడం జరిగిందని, దరఖాస్తుదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.