KMR: పోలీస్,ఫైర్ అనుమతులు లేకుండా బాణసంచా దుకాణాలు ఎవరూ పెట్టవద్దని ఆదివారం బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు సూచించారు. వ్యాపారులు తప్పనిసరిగా అనుమతలు తీసుకోవాలని తెలిపారు. అనుమతలులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జనావాసాల మధ్య దుకాణాలు పెట్టవద్దని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.