KNR: ఉమ్మడి జిల్లాలో ఉన్న యువజన మహిళా సంఘాల సమాచార జాబితాను తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షులు సత్తినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకలను గ్రామీణ ప్రాంతాలకు చెరవేసేందుకు పాటుపడాలన్నారు.