SRPT: తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డులను, BRS నాయకులు ఆదివారం ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు పలువురు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు.