ATP: గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్లో ఇవాళ నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ నయుమ్ పరిశీలించారు. రోడ్డుపై నిల్వ ఉన్న మురుగు నీటిని తీసివేయించి డ్రైనేజీ పనులను చేయించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరగా డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సదురు కాంట్రాక్టర్కు ఆదేశించారు.