E.G: రాజమండ్రిలో స్నాన ఘట్టాలు దుర్భరంగా ఉన్నాయని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఈనెల 21 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్నాన ఘట్టాలను శుభ్రం చేయాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వదిలేస్తారని మండిపడ్డారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన హయాంలో గోదావరి ప్రక్షాళనకు రూ.88 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని అన్నారు.