అన్నమయ్య: తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు 33/11 కేవీఏ విద్యుత్ ఉప కేంద్రంలో ఆదివారం దసరా పూజలు చేశారు. ఏఈ సురేంద్ర, సబ్ ఇంజినీర్ శేషు కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్లు, బ్రేకర్లు, వీసీబీ, కేపాసిటర్ బ్యాంకులు, విద్యుత్ ఏబీ స్విచ్లులకు ఆయుధ పూజలు చేశారు. ఈ మేరకు ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా, ఆటంకాలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరగాలని పూజలు చేశారు.