WNP: మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడగించినట్లు వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం బ్యాంకులు పనిచేయకపోవడంతో డీడీలు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురుగా వ్యాపారుల వినతులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లక్కీ డ్రా ఈనెల 27న కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనునట్లు వెల్లడించారు.