ATP: గుంతకల్లులోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో చేస్తున్న సామూహిక దీక్షలు ఇవాళ 6వ రోజుకి చేరాయి. దీక్షపరులకు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సంఘీభావం తెలిపి తమ మద్దతు తెలిపారు. AISF జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేస్తున్న అధికారుల్లో ఎలాంటి చలనం లేదన్నారు.