భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో వృథా అయిన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని అంపైర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్‌ను 50 ఓవర్ల నుంచి 35 ఓవర్లకు కుదించారు. తాజా నిబంధనల ప్రకారం, ఒక బౌలర్ అత్యధికంగా 7 ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు. అలాగే, ఇన్నింగ్స్ బ్రేక్‌ను కూడా 20 నిమిషాలకు తగ్గించారు.