KMR: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తోంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు 12 వరద గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. దిగవకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తామని మంజీర పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.