AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్న వారికి భవిష్యత్లో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. మంచితో వచ్చే భక్తి కంటే భయంతో వచ్చే భక్తి ఎక్కువ కాలం ఉంటుందని, దానిని చూపిస్తానని అన్నారు.