TG: మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ప్రశ్నలు సంధించారు. మంత్రి ఇంట్లో ఉన్న నిందితుడికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఎందుకు ఆశ్రయం ఇచ్చారు అని ప్రశ్నించారు. నిందితుడిని మంత్రి స్వయంగా కారులో తీసుకెళ్తే పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఈ కేసులో అసలు ఏం జరిగింది? ఎక్కడ సెటిల్మెంట్ జరిగింది? అని ప్రశ్నించారు.