కోనసీమ: ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి వారిని కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు.