SKLM: ఆమదాలవలస పట్టణంలోని ఉన్న పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో మరుగుదొడ్లు లేకపోవడం వలన అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా కార్యాలయం భవనం పాతది కావడంతో స్లాబ్ పై కప్పు లీకులు కావడం వంటి సమస్యలు ఉన్నాయి. వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా మారుతోందని సిబ్బంది చెబుతున్నారు.