NGKL: సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్త వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న టెక్నాలజీ తగ్గట్టుగానే సైబర్ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ లైన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బ్యాంకు వివరాలు, OTP అడిగితే చెప్పవద్దని వారు సైబర్ మోసగాళ్లని గుర్తించాలని తెలిపారు.