KMR: జిల్లా బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డుపై నడవాలంటేనే రైతులు జంకుతున్నారు. సుమారు 100 మంది రైతులు ఈ దారి వెంట వెళ్తూ ప్రమాదాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలని రైతులు వేడుకుంటున్నారు.