బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెర్నాంబుకోలో బస్సు బోల్తాపడి 15 మంది మృతిచెందారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.