MNCL: మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉత్సాహంగా జరుగుతోంది. మొత్తం 418 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కీలకమైన ఆరు పదవులకు (ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ, కల్చర్ సెక్రెటరీ, ట్రెజరర్) మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.