BPT: పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు గ్రామంలో కొలువైన శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో ధన త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ శుభ సందర్భంగా, భక్తులకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాదేవి అలంకరణలో అమ్మవారు దివ్య దర్శనం ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.