కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న పోలీస్ అధికారులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని బాణాసంచా గోదాములు, విక్రయ కేంద్రాలను ఈరోజు పరిశీలించారు. తనిఖీలలో రెవెన్యూ, ఫైర్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు లైసెన్స్ చెల్లుబాటు, భద్రతా ప్రమాణాలు, ఫైర్ ఎక్స్ టింగ్విషర్ల లభ్యత, ఫైర్ హైడ్రెంట్ పనితీరు అగ్ని ప్రమాద పరికరాలను పరిశీలించారు.