BHNG: బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఇవాళ హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లేఖ రాశారు. ఈ నెల 13వ తేదీన దత్తాత్రేయ బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించి అధ్యాపకులు, విద్యార్థులు,రోగులతో మాట్లాడిన విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా రాష్ట్ర సీఎంకి ఎయిమ్స్ అభివృద్ధికి పలు సూచనలను చేస్తూ లేఖ పంపారు.