ATP: పుట్లూరు మండలం కందికపుల గ్రామానికి చెందిన భరత్ ఐక్యరాజ్యసమితి యూత్ కోఆర్డినేషన్ అధికారిగా నియమితులయ్యారు. న్యూ ఢిల్లీలోని UNFPA, UNV ఇండియాలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, UNFPA, UNV ఇండియా సంయుక్తంగా ఈ నియామకం చేపట్టాయి. ఆయనకు ప్రజా ప్రతినిధులు, స్థానికులు అభినందనలు తెలిపారు.