TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈసీకి 40 మంది ప్రముఖ నేతల పేర్లను పంపారు. అందులో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, సీనియర్ నేత విశ్వనాథ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, ప్రముఖులు ఉన్నారు.