ADB: ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 9, 11 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు ఈనెల 23 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8,10 చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.