AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా ఆన్లైన్ డిప్ ఉ.10 గంటలకు ప్రారంభమైంది. ఈనెల 21 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. 23న మరిన్ని ఆర్జిత సేవలు విడుదల కానున్నాయి. 23న మ.3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, 24న శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 25న వృద్ధులు, దివ్యాంగుల కోటా, అదే రోజు ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.