VSP: రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదివారం గాజువాకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ.15 కోట్ల నిధులతో చేపట్టనున్న బీసీ రోడ్ విస్తరణకు, అవసరమైన సర్వీస్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పనుల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం లభించనుందని పేర్కొన్నారు.