BDK: జూలూరుపాడు మండలం చింతలతండా గ్రామంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం తీసుకువెళ్లడానికి ప్రభుత్వం అందజేస్తున్న ప్రత్యేక సంచులను మాజీ సర్పంచ్ రాములు లబ్ధిదారులకు అందజేశారు. నిరుపేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు.