WGL: సంగెం మండలం తిమ్మాపురం వద్ద ఎస్సారెస్పీ కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలింది. కాల్వ పక్కన వ్యవసాయం చేస్తున్న రైతులు దాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. గుర్తింపు వివరాలు తెలిసేలా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.