KKD: జిల్లాలో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.220, బోన్లెస్ చికెన్ రూ.250 రూపాయలు, చర్మంతో ఉన్న చికెన్ రూ.180 నుంచి రూ.200 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాలు కిటకిటలాడాయి. గతవారంతో పోల్చుకుంటే ఈ వారం చికెన్ ధరలు పది రూపాయల వ్యత్యాసంతోనే కొనసాగుతున్నాయి.