MDCL: జిల్లా పరిధి హబ్సిగూడ సర్కిల్, ఉప్పల్ రింగ్ రోడ్డు, నాచారం చౌరస్తా, మల్లాపూర్, ఈసీఐఎల్, కుషాయిగూడ ప్రాంతాల్లో రోజురోజుకు ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో రద్దీ కారణంగా కిలోమీటర్ ప్రయాణం, అర్ధ గంట పడుతుంది. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.